స్వాతంత్ర్య భారత్ న్యూస్, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మున్సిపాలిటీ పరిధిలోని స్నేహ గార్డెన్‌లో మణుగూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐతనబోయిన సతీష్ సోదరుడు ఐతనబోయిన రమేష్–శరణ్య దంపతుల కుమార్తె ప్రహర్షిణి, కుమారుడు మణికంఠ సాయి హర్షల ఓణి అలంకరణ, పంచకట్టు శుభకార్య వేడుక ఘనంగా నిర్వహించారు.
ఈ శుభకార్య వేడుకకు పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షింతలు వేసి, వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ తన ఆశీస్సులు అందించారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, శుభకార్యాన్ని నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి శుభకార్యాలు కుటుంబ సభ్యుల మధ్య ఆనందాన్ని, ఆత్మీయతను మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు కూరం రవి, మాజీ సర్పంచ్, లైన్స్ క్లబ్ అధ్యక్షులు దొబ్బల వెంకటప్పయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమలేష్, లక్ష్మణ్, వెంకట్రావు, మహిళా నాయకురాలు శ్యామల, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.