స్వాతంత్ర్య భారత్ న్యూస్, పినపాక: పినపాక మండల జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని కె. ప్రతీక చౌదరి రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–17 బాలికల క్రికెట్ పోటీలకు ఎంపికైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన సెలక్షన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అర్హత సాధించింది. ప్రతీకను హెచ్‌ఎం డి. రామిరెడ్డి, పీఈటీ డి. వరలక్ష్మి, ఉపాధ్యాయులు అభినందించారు.
రాష్ట్రస్థాయి క్రికెట్‌కు పినపాక విద్యార్థిని ప్రతీక ఎంపిక
bySWATANTRYA BHARAT NEWS
-
0