అచ్చంపేటలో పాముల సంరక్షణపై అవగాహన కార్యక్రమం

స్వాతంత్ర్య భారత్ న్యూస్, అచ్చంపేట: వన్యప్రాణి వారోత్సవాలు–2026లో భాగంగా అచ్చంపేట పట్టణంలోని ఎన్‌టీఆర్‌ స్టేడియంలో వాకర్స్‌ క్లబ్‌ సభ్యులకు పాముల సంరక్షణ, రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాములపై ఉన్న అపోహలను తొలగించి, వన్యప్రాణుల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడమే కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా స్నేక్‌ క్యాచర్‌ సుమన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, అచ్చంపేట ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ హన్మంతు నాయక్‌ పాముల వివిధ జాతులు, విషపూరిత–విషరహిత పాముల గుర్తింపు, వాటి ప్రవర్తన, నివాస ప్రాంతాలపై వివరించారు. పాములు పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తాయని, ఎలుకలు తదితర హానికర జీవుల నియంత్రణలో వాటి ప్రాధాన్యత ఎంతో ఉందని తెలిపారు. ఇళ్లలోకి పాములు ప్రవేశించినప్పుడు ప్రజలు భయపడకుండా వాటిని చంపకుండా, సురక్షిత దూరంలో ఉండి శిక్షణ పొందిన స్నేక్‌ రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. పాముకాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలు, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రతి పాము ప్రమాదకరమైనది కాదని, ప్రకృతి సమతుల్యత కోసం పాముల సంరక్షణ అవసరమని అవగాహన కల్పించారు. వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు ఆసక్తిగా పాల్గొని పాములకు సంబంధించిన సందేహాలను అడిగి తెలుసుకున్నారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రకృతి, వన్యప్రాణులు, జీవవైవిధ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నాగర్‌కర్నూల్‌ జిల్లా అటవీ అధికారి శ్రీ రేవంత్‌ చంద్ర, IFS తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

⚡ SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD LIVE
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

🔥 సబ్సిడీ వరకు ₹78,000* ఉచితం! 🔥
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ Huge reduction in current bill
🌱 Clean green energy
🏠 Increase in the value of your home property
🏛️ Direct government subsidy benefit
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727