పెదవాగు దారిని అభివృద్ధి చేస్తున్నాం: సర్పంచ్ మద్దెల సమ్మయ్య


పినపాక మండల పరిధిలో గల పోట్లపల్లి గ్రామం నుంచి పెదవాగుకు వెళ్లే రహదారిని ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా అభివృద్ధి చేస్తున్నామని పోట్లపల్లి సర్పంచ్ మద్దెల సమ్మయ్య తెలిపారు. ఈ మార్గంలో రహదారికి ఇరువైపులా చెట్లు, పొదలు, పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో ప్రజలు, రైతులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎంపీడీవో సంకీర్త్, ఎంపీఓ వెంకటేశ్వరరావు ఆదేశాలతో రహదారి మార్గాన్ని శుభ్రం చేసి, ఇరువైపులా ఉన్న చెట్లు, పొదలను తొలగించే పనులను చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. రహదారి అందుబాటులోకి వస్తే పెదవాగుకు వెళ్లే గ్రామస్తులు, రైతులు, వాహనదారులకు రాకపోకలు సులభతరం అవుతాయన్నారు.గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు తన వంతు కృషి చేస్తున్నానని మద్దెల సమ్మయ్య తెలిపారు. పెదవాగు మార్గం అభివృద్ధి పనులను అవసరమైన మేరకు కొనసాగించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా రహదారిని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ సందీప్, ఉప సర్పంచ్ రవీందర్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

⚡ SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD LIVE
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

🔥 సబ్సిడీ వరకు ₹78,000* ఉచితం! 🔥
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ Huge reduction in current bill
🌱 Clean green energy
🏠 Increase in the value of your home property
🏛️ Direct government subsidy benefit
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743