కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం లంబాడీలను ఎస్టీలలో చేర్చింది. షెడ్యూల్డ్ తెగల జాబితా నుంచి లంబాడాలను తొలగించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. తుడుందెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య.

కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం లంబాడీలను ఎస్టీలలో చేర్చింది

షెడ్యూల్డ్ తెగల జాబితా నుంచి లంబాడాలను తొలగించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి

తుడుందెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య



సెప్టెంబర్ 18న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను విజయవంతం చేయాలి

ఇతర రాష్ట్రాల లంబాడి వలసలతో రాజ్యాంగ ఫలాలు అందుకోలేకపోతున్న ఆదివాసీలు



*గుండాల మండలం సెప్టెంబర్ 7 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

హైదరాబాద్‌లోని ఇంద్రాపార్క్ వద్ద సెప్టెంబర్ 18వ తేదీన నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.

ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ, ఆధార్ సొసైటీ, ఏఇడబ్ల్యూసిఏ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 18న హైదరాబాద్ ఇంద్రాపార్క్‌లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్డ్ తెగల జాబితా నుంచి లంబాడాలను తొలగించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ మహాధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ప్రజలు, ఆదివాసీ సంఘాల నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు తరలివచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు.

ఆదివాసీలు సుమారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడి 1874లో ఏజెన్సీ జిల్లాలను బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారానే సాధించుకోవడం జరిగిందని రమణాల లక్ష్మయ్య అన్నారు. వడ్డీ వ్యాపారుల దోపిడీ, ఆదివాసీల భూముల అన్యాక్రాంతానికి వ్యతిరేకంగా, గిరిజనేతరుల వలసలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడంతో బ్రిటిష్ ప్రభుత్వం 1917లో చట్టాన్ని తీసుకువచ్చిందని, తద్వారా భూమిపై కూడా హక్కులు సాధించుకున్నామని తెలిపారు.

స్వాతంత్ర్యం అనంతరం భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన తరువాత రాజ్యాంగంలోని 244వ ప్రత్యేక అధికరణ ద్వారా ఐదవ, ఆరవ షెడ్యూల్ కింద ఆదివాసీ ప్రాంతాలను ప్రకటించడం జరిగిందని తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342ను అనుసరించి 1950, 1956లో 30 ఆదిమ తెగలను షెడ్యూల్డ్ తెగలుగా ఎస్టీలుగా గుర్తించారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయ లబ్ధి కోసం బీసీ ఏలుగా ఉన్న లంబాడాలను బంజారా పేరుతో కేవలం 149 జీవో ద్వారా 1976లో తెలంగాణలో ఎస్టీలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని రమణాల లక్ష్మయ్య ఆరోపించారు. డీఎన్‌టీలుగా ఉన్న లంబాడాలు 149 జీవో ద్వారా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. 1977లో ఏపీ సెక్రటరీగా ఉన్న ఎస్ఆర్ శంకరన్ లంబాడాలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకూడదని కలెక్టర్లకు నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు.

1980లోనే హైమన్ డార్ఫ్ లంబాడాలు అమాయక ఆదివాసీలతో జననం, జీవనం సాగిస్తే అన్ని రకాలుగా దోచుకుంటారని హెచ్చరించారని రమణాల లక్ష్మయ్య తెలిపారు.

తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలైన పూర్వ ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో లంబాడాలు భూములను క్రయవిక్రయాలు జరిపి ఏజెన్సీలో భూములను స్వాధీనం చేసుకునే హక్కులు లేవని జీవో ఎంఎస్ నంబర్ 80, తేదీ 04-04-1988, 1985 సంవత్సరంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ AP విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ 1959 లంబాడాలకు వర్తించదని జీవో ఎంఎస్ నంబర్ 80 చెబుతున్నదని అన్నారు. మూడు భూములపైన కూడా హక్కులు వర్తించవని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం లంబాడాలను వారి పేరు మీద పట్టాలు ఇస్తూనే ఉన్నదని ఆరోపించారు.

ఎస్టీలమని చెప్పుకొని విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో ఆదిమ తెగలకు చెందవలసిన రిజర్వేషన్లు ఉపయోగించుకొని విద్యాపరంగా కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల్లో, నవోదయ పబ్లిక్ పాఠశాలల్లో, ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఏకలవ్య మినీ గురుకుల, గురుకుల కాలేజీల్లో ఆదిమ తెగల విద్యార్థులకు ఏమాత్రం అవకాశాలు రాకుండా లంబాడాలు రిజర్వేషన్ అనుభవిస్తున్నారని రమణాల లక్ష్మయ్య ఆరోపించారు.

లంబాడీ ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీలుగా గుర్తించడంతో ఇతర రాష్ట్రాలైన రాజస్థాన్‌లో ఓసీలుగా, మహారాష్ట్రలో బీసీలుగా, కర్ణాటకలో ఎస్సీలుగా ఉన్న లంబాడాలు తెలంగాణకు విపరీతంగా వలసలు పెరిగి నేడు 25 లక్షలకు పైగా జనాభా పెరగడం జరిగిందని తెలిపారు. లంబాడాల వలసలతో ఆదివాసీలు రాజ్యాంగ ఫలాలు అందుకోలేకపోతున్నారని అన్నారు.

లంబాడాలు ఎస్టీ రిజర్వేషన్‌ను ఉపయోగించుకొని ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లుగా కొనసాగుతున్నారని ఆరోపించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో డీఎస్పీ, సీఐ, ఎస్సైలుగా, కానిస్టేబుల్స్‌గా అన్ని పోస్టులు వాళ్లే అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌లో రేంజర్లు, బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లుగా కొనసాగుతున్నారని అన్నారు. ఐటీడీఏలో పనిచేస్తున్న టీచర్లుగా వాళ్లే ఎక్కువ లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు.

గిరిజన కార్పొరేషన్ (జీసీసీ)లో క్రింది స్థాయి నుండి కమిషనర్ వరకు లంబాడాలే ఉన్నారని రమణాల లక్ష్మయ్య ఆరోపించారు. రాజకీయంగా ఎస్టీ రిజర్వేషన్‌ను ఉపయోగించుకొని ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులుగా రాజకీయంగా బలపడి, ఆదివాసీలకు చెందిన వనరులైన ఏజెన్సీలోని వైన్ షాపులు, పెట్రోల్ బంకులు, గ్యాస్ డీలర్లుగా, దొంగ ఏజెన్సీ సర్టిఫికేట్స్ పొంది లంబాడాలు దొడ్డిదారిన ఆదివాసీలకు చెందవలసిన అన్ని అవకాశాలను లాక్కుంటున్నారని ఆరోపించారు.

చట్టబద్ధత లేని లంబాడాలు అన్ని రంగాల్లో మోసం చేస్తూ ఆదివాసీలకు చెందవలసిన రిజర్వేషన్లను లాక్కొని తింటుంటే, యాభై సంవత్సరాలుగా అక్రమంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతున్న లంబాడాలపై ఆదివాసీ సమాజం లంబాడాలను షెడ్యూల్డ్ తెగల జాబితా నుండి తొలగించాలని డిమాండ్లతో ఉద్యమిస్తుంటే, పాలక ప్రభుత్వం లంబాడాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఎస్టీ జాబితాలో కలిసి యాభై సంవత్సరాలు పూర్తైన సందర్భంగా అనేక రంగాలలో అభివృద్ధి చెందామని స్వర్ణోత్సవ సభలను జరుపుకుంటున్న లంబాడాలకు పాలక ప్రభుత్వం బాగా స్వామ్యంతో అన్ని విధాలుగా సహాయ సహకారాలు, స్వర్ణోత్సవ, సభలు, జైత్ర యాత్రలు, సంబరాలు జరుగుతున్నాయని రమణాల లక్ష్మయ్య అన్నారు.

ఆదివాసీలుగా, ఆదివాసీ సంఘాలుగా ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నామని ఆయన తెలిపారు. ఆదివాసీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఆదిలాబాద్ నుండి ఖమ్మం జిల్లా వరకు ఆదివాసీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగిందని అన్నారు. ఆదివాసీలను ఏమాత్రం లెక్కచేయకుండా పాలక ప్రభుత్వం లంబాడీలకి కొమ్ముకాస్తూ వాళ్లకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నదని ఆరోపించారు. దీనిని ఆదివాసీ సంఘాలుగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 18న హైదరాబాద్ ఇంద్రాపార్క్‌లో నిర్వహించే మహాధర్నాకు ఆదివాసీ సమాజం పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని రమణాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. ఆదివాసీ హక్కులు, రాజ్యాంగ రక్షణ, ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన అవకాశాల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు వట్టం కన్నయ్య, పూనెం బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి పూనెం శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దుగ్గారపు వీరభద్రం, జిల్లా ప్రధాన కార్యదర్శి వజ్జ యర్రయ్య, జిల్లా కార్యదర్శి ఈసం సాంబయ్య, జిల్లా ఉపాధ్యక్షులు చంత వెంకటేశ్వర్లు, గుండాల మండల అధ్యక్షులు గోవిందా నరసింహారావు, మండల ప్రధాన కార్యదర్శి మోకాళ్ళ మహేందర్, మండల కమిటీ సభ్యులు తాటి వినోద్, భార్గవ్, జవ్వాజి జోషి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727