జవ్వాజి లక్ష్మీనారాయణ ఆశయాల సాధనకు ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం. ఆదివాసీ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన అమరుడు జవ్వాజి లక్ష్మీనారాయణ. తుడుందెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య

జవ్వాజి లక్ష్మీనారాయణ ఆశయాల సాధనకు ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం

ఆదివాసీ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన అమరుడు జవ్వాజి లక్ష్మీనారాయణ

తుడుందెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య


*గుండాల మండలం సెప్టెంబర్ 6 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

గుండాల: ఆదివాసీ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన అమరుడు జవ్వాజి లక్ష్మీనారాయణ ఆశయాల సాధన కోసం ఆదివాసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య అన్నారు. గుండాల మండల కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన జవ్వాజి లక్ష్మీనారాయణ 8వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

1998 నుంచి 2018 వరకు తుడుందెబ్బలో వివిధ స్థాయిల్లో, వివిధ బాధ్యతల్లో పనిచేసిన జవ్వాజి లక్ష్మీనారాయణ అనేక ఆదివాసీ ఉద్యమాలను నిర్మించారని లక్ష్మయ్య గుర్తుచేశారు. ఆదివాసీల హక్కులు, చట్టాల పరిరక్షణతో పాటు జల, జంగల్, జమీన్, ఆదివాసీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను కాపాడేందుకు ఆయన అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు.

ప్రత్యేకంగా 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం (FRA), GO నంబర్ 3ను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టారని అన్నారు. ఆదివాసీ ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు ఉద్యోగుల, విద్యార్థి, మహిళా సంఘాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తునికాకు ధర పెంపు కోసం కూడా అనేక పోరాటాలు చేశారని తెలిపారు.

అలాగే ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మందకృష్ణ మాదిగతో కలిసి సభలు, సదస్సులు, ధర్నాల్లో పాల్గొన్నారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ చురుకైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. భద్రాచలంలో పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలతో పాటు, అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న ఆదివాసీ రైతులకు హక్కులు, పట్టాలు కల్పించాలనే డిమాండ్‌తో జంతర్‌మంతర్ ధర్నాలు, రాస్తారోకోలు తదితర ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు.

“జవ్వాజి లక్ష్మీనారాయణ ఒక వ్యక్తి మాత్రమే కాదు.. ఆదివాసీ హక్కుల ఉద్యమానికి స్ఫూర్తి. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి. ఆదివాసీ హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం తుడుందెబ్బ పోరాటం నిరంతరం కొనసాగుతుంది” అని రమణాల లక్ష్మయ్య స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు వట్టం కన్నయ్య, పూనెం బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి పూనెం శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు దుగ్గారపు వీరభద్రం, జిల్లా ప్రధాన కార్యదర్శి వర్జా ఎర్రయ్య, జిల్లా కార్యదర్శి ఈశం సాంబయ్య, జిల్లా ఉపాధ్యక్షులు చింత వెంకటేశ్వర్లు, గోవిందన్న నర్సింహారావు, గుండాల మండల అధ్యక్షులు మోకాల్ల మహేందర్, మండల ప్రధాన కార్యదర్శి, కోశాధికారి తాటి వినోద్, జవ్వాజి జోషి, భర్గవ్, టేకులపల్లి మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727