భద్రాచలంలో ఘనంగా స్వచ్ఛభారత్ కార్యక్రమం: పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం

 

భద్రాచలం సెప్టెంబర్ 29 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి: పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాదని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను తమ సామాజిక బాధ్యతగా భావించాలని భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే. జాన్ మిల్టన్ పిలుపునిచ్చారు. భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీఆర్‌పీఎఫ్ (CRPF) 141 బెటాలియన్ సిబ్బంది మరియు కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ (NSS) యూనిట్ల ఉమ్మడి సమన్వయంతో 'స్వచ్ఛభారత్' కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని కళాశాల ప్రాంగణాన్ని శుభ్రపరచడంతో పాటు, చుట్టూ పేరుకుపోయిన కలుపు మొక్కలు, వ్యర్థాలను తొలగించారు. విద్యార్థుల్లో పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణపై స్పృహ, అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ హిమజ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ శ్రీను, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ఎం. కిరణ్ కుమార్, బి. సుధాకర్, సీఆర్‌పీఎఫ్ 141 బెటాలియన్ సిబ్బంది మరియు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

SBNEWS ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727