రాష్ట్రంలో సంక్షేమం పథకాలు పూర్తిగా ఆగిపోయాయి
రేగ సమక్షంలో పలువురు చేరిక
మండలంలో పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించిన రేగా
గుండాల మండలం సెప్టెంబర్ 23 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ రేవంత్ రెడ్డి పాలన సాగుతుందని బి ఆర్ ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. బుధవారం గుండాల మండలంలో పర్యటించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విరుచుకపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంక్షేమ పథకాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయని అన్నారు. రాక్షస పాలన సాగించడం ద్వారా ప్రజలపై ప్రతిపక్ష పార్టీలపై తప్పుడు కేసులు పెడుతూ భౌతిక దాడులకు దిగుతున్నారని అన్నారు. రానున్నది బీఆర్ఎస్ పార్టీ సర్కారేనని అందరి లెక్కలు తర్వాత నేను తేల్చుతానని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలు తులం బంగారానికి ఆశపడితే ఉన్న కళ్యాణ లక్ష్మి పోయిందని ఇప్పటికైనా మహిళలు అర్థం చేసుకొని కాంగ్రెస్ సర్కార్ నడ్డి విరవాలని అన్నారు. మండల కేంద్రంలో ఉన్న ఐదు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలను చేశారు మండపాల నిర్వాహకులు రేఖ కాంతారావును ఘనంగా శాలవాలతో సన్మానించారు.అనంతరం రేగా కాంతారావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో పాల కుటుంబాలు చేరారు టీజేఎస్ మండల అధ్యక్షుడు గొల్లపల్లి రమేష్ రేగా కాంతారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం పార్టీ అధికార ప్రతినిధి రాము తండ్రిగారైన రామయ్య ఏడాది మాషికానికి హాజరయ్యారు అనంతరం అనారోగ్యంతో మృతి చెందిన బొబ్బిలి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. అనారోగ్యంతో కోలుకొని వచ్చిన బొబ్బిలి అరుణ ను పరామర్శించి యోగక్షేమాలి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలం పరిధిలోని సాయినపల్లి గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ వర్కర్ బొమ్మెర లక్ష్మి మృతి చెందడంతో కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ మండల అధ్యక్షుడు తెల్లం భాస్కర్, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వీరస్వామి, పార్టీ నాయకులు గడ్డం వీరన్న, వట్టం రవి, సయ్యద్ అజ్జు, అటికం నాగేశ్వరావు, కాలు, తాటి కృష్ణ, లక్ష్మీనారాయణ, గడ్డం రమేష్, నీట్ట రాములు, రాంబాబు, బండారి రాజు, వెంకన్న, మహేందర్, శోభన్ బాబు, సుధాకర్, లక్ష్మయ్య, సుధాకర్, బాలు, భూ పెళ్లి లలిత, చేబోతు గాయత్రి, రాజకుమారి, చంద్రకళ, శ్రీను, రవి, పద్మారావు, సతీష్, ప్రమోద్, ప్రశాంత్, పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పాల్గొన్నారు.
Tags
Bhadradri Kothagudem
MAHABUBABAD
MAHABUBNAGAR
MANCHERIAL
MEDAK
MEDCHAL
mulugu
NAGARKURNOOL
NALGONGA
NARAYANPET
NIRMAL
NIZAMABAD