SBNEWS, కరకగూడెం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో కరకగూడెం మండలంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఎస్ఐ పీవీఎన్ రావు సూచించారు. భారీ వర్షాల సమయంలో వాగులు, వంకలు, నీటి గుంటలు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులను నీటి ప్రవాహాల సమీపంలోకి వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా చూడాలని తెలిపారు. వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ వైర్లు, ఇతర విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తున్న సమయంలో వాహనాలతో లేదా కాలినడకన దాటే ప్రయత్నం చేయవద్దని ఎస్ఐ పీవీఎన్ రావు సూచించారు. నీటి ప్రవాహం తీవ్రత తెలియక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఎక్కడైనా వరద పరిస్థితి ఏర్పడినా, రహదారులపై నీరు నిలిచినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రతకు పోలీసులు అందుబాటులో ఉంటారని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు. వర్షాల సమయంలో ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Tags
ADILABAD
BHADRADRI KOTHAGUDEM
HANUMAKONDA
HYDERABAD
JAGTIAL
JANGAON
JAYASHANKAR BHUPALPALLY
JOGULAMBA GADWAL
KAMAREDDY
KARIMNAGAR
khammam
KUMURAM BHEEM
TELANGANA
