రాహుల్‌ గాంధీపై కేసు రద్దు చేయాలి: యూత్‌ కాంగ్రెస్‌ భారీ నిరసన

రాహుల్‌ గాంధీపై కేసు రద్దు చేయాలి: యూత్‌ కాంగ్రెస్‌ భారీ నిరసన
మణుగూరు: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై నమోదు చేసిన కేసును వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పినపాక నియోజకవర్గంలోని మణుగూరు హెడ్‌క్వార్టర్స్‌లో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చీకటి కార్తీక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాలసాని సంజయ్‌ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ జరిగిన వేదికను కొందరు బీజేపీ కార్యకర్తలు గంగాజలంతో శుద్ధీకరణ చేయడం దళితులను అవమానించే చర్యగా కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు. ఈ ఘటనపై రాహుల్‌ గాంధీ స్పందిస్తూ దళితుల గౌరవానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారని తెలిపారు. అయితే, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీపైనే కేసు నమోదు చేయడం అన్యాయమని యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో మణుగూరు కేంద్రంగా భారీ నిరసన ర్యాలీ చేపట్టి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. “దేశ్‌ కీ నేత రాహుల్‌ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలి” అని నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని వారు అన్నారు.

రాహుల్‌ గాంధీపై నమోదు చేసిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని, దళితుల పట్ల బీజేపీ నాయకులు అనుసరిస్తున్న వైఖరిని మార్చుకోవాలని నాయకులు డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లను పట్టించుకోకుండా మొండి వైఖరి కొనసాగిస్తే రానున్న రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పినపాక యూత్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుధాకర్‌ రెడ్డి, కొత్తగూడెం యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పాల సత్యనారాయణ రెడ్డి, భద్రాచలం యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎడారి ప్రదీప్, వైస్‌ ప్రెసిడెంట్‌ గాడి విజయ్, రామ్మూర్తి, ప్రణయ్‌, మణుగూరు మండల అధ్యక్షుడు ఐతనబోయిన సతీష్, అశ్వాపురం యూత్‌ కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గొల్లపల్లి నరేష్‌ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, యూత్‌ కాంగ్రెస్‌ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727