స్వాతంత్ర్య భారత్ న్యూస్, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) ప్రధాన గేటు వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీటీపీఎస్‌కు సంబంధించిన పలు అంశాలపై నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్‌కుమార్ బీటీపీఎస్ సీఈతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాన గేటు వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు.
మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) ప్రధాన గేటు వద్ద మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాటు మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావును పోలీసులు అడ్డుకున్నారు. బీటీపీఎస్‌లోకి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలను అనుమతించబోమని, ఒకరు లేదా ఇద్దరు మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంటుందని మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. దీంతో పువ్వాడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. “ఇది పాకిస్తాన్ కాదు.. ఎందుకు అడ్డుకుంటున్నారు?” అంటూ పోలీసులను ప్రశ్నించారు. అనంతరం బీటీపీఎస్ సీఈతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు కూడా పాల్గొన్నారు. ఈ ఘటనతో బీటీపీఎస్ ప్రధాన గేటు వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.