మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి

మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి

*గుండాల మండలం సెప్టెంబర్ 1 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని ఊకే శిరీష కుటుంబానికి న్యాయం చేయాలని టిడిపి గుండాల మండల కమిటీ డిమాండ్ చేసింది మంగళవారం నాడు వారు విలేకరులతో మాట్లాడుతూ ములకలపల్లి మండలం చౌటి గూడెం గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసి మహిళా నర్సింగ్ విద్యార్థిని పై  హైదరాబాదులో అత్యాచారం జరిగిందని  ఇప్పటివరకు ప్రభుత్వం బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నా హామీ ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు.  నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగి ఎన్నో కష్టాలను కోర్చి బ్రతుకుతెరువు కోసం పట్టణాలకు వెళ్లిన పేద అణగారిన వర్గాలకు రక్షణ కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారని ఊకె శిరీష విషయంలో అదే జరిగిందని గతంలో ఇలాంటి ఘటనలు అగ్రవర్ణాలకు జరిగితే వెంటనే స్పందించి శిక్ష విధించిన పాలకులు ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని శిరీష కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగం వారి కుటుంబ సభ్యులకు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్ష కార్యదర్శులు తోలెం సాంబయ్య,ఇల్లందుల అప్పారావు, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఇల్లందుల నరసింహులు, మొల్కం మధు,చీకటి యాకయ్య,మొల్కం రామకృష్ణ,వాగబోయిన హుషార్,రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727