సమితి సింగారంలో VB–G RAM G పథకంపై గ్రామసభ
మణుగూరు: మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కలబోయిన మాధవరావు అధ్యక్షతన VB–G RAM G పథకంపై గ్రామసభ నిర్వహించారు. గ్రామీణ పేద కుటుంబాలకు 125 రోజుల ఉపాధి కల్పించడంతో పాటు రోడ్లు, కాలువలు, ప్రజా ఆస్తుల నిర్మాణం, నీటి సంరక్షణ, భూగర్భ జలాల అభివృద్ధి, వ్యవసాయానికి అవసరమైన భూమి అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. పథకం పనుల్లో పారదర్శకత పాటించడంతో పాటు సామాజికంగా వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తామని, పనుల అనంతరం సామాజిక తనిఖీలు నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకాంత్, ఎంపీఓ వెంకటేశ్వరరావు, ఉపసర్పంచ్ గాండ్ల సురేష్, కార్యదర్శి అశోక్ కుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Tags
మణుగూరు