SBNEWS, మణుగూరు: సింగరేణి సంస్థ నుంచి జెన్‌కోకు బొగ్గు సరఫరాను ప్రభుత్వం నిలిపివేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రేపు మణుగూరులో మహాధర్నా నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. రాష్ట్రంలోని జెన్‌కో విద్యుత్ కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (BTPS) ప్రధాన గేటు వద్ద ఉదయం 9 గంటలకు మహాధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. బొగ్గు సరఫరా నిలిపివేత అంశంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మహాధర్నా చేపడుతున్నట్లు బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని రేగా కాంతారావు పిలుపునిచ్చారు.