SBNEWS, మణుగూరు: బులియన్ మార్కెట్ ఏరియాలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకుడి చేతిలోని లడ్డూ ప్రసాదానికి నిర్వహించిన వేలంపాట ఉత్సాహభరితంగా సాగింది. భక్తులు, స్థానికులు ఆసక్తిగా పాల్గొన్న ఈ వేలంపాటలో లడ్డూ ప్రసాదానికి భారీ ధర పలికింది. వేలంలో నీరజా జువెలరీ అధినేత కంచర్ల శ్రీనివాస్ రూ.3,47,116లకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. వేలంపాటలో అత్యధిక మొత్తాన్ని పాటించి లడ్డూను సొంతం చేసుకోవడంతో నిర్వాహకులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటకు భక్తుల నుంచి మంచి స్పందన లభించింది. వేలం అనంతరం నిర్వాహకులు కంచర్ల శ్రీనివాస్‌ను అభినందించారు. ఈ సందర్భంగా ఉత్సవ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది.
