స్వాతంత్ర్య భారత్ న్యూస్, మణుగూరు: మణుగూరు భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో మూడవ యూనిట్ సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. దీంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. యూనిట్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యను గుర్తించిన అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. వీలైనంత త్వరగా లోపాన్ని సరిచేసి యూనిట్‌ను తిరిగి ఉత్పత్తిలోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. యూనిట్ నిలిచిపోవడంతో విద్యుత్ ఉత్పత్తిపై తాత్కాలిక ప్రభావం పడింది.
Tags
Telangana