డోన్‌లో తాగునీటి సమస్యపై సీపీఎం ఆగ్రహం

డోన్‌లో తాగునీటి సమస్యపై సీపీఎం ఆగ్రహం
కమిషనర్ నిర్లక్ష్యమే కారణం.. వెంటనే బదిలీ చేయాలని డిమాండ్
డోన్: డోన్ పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యకు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ నిర్లక్ష్యం, మొండి వైఖరే కారణమని సీపీఎం పట్టణ కార్యదర్శి నక్కీ శ్రీకాంత్ విమర్శించారు.ఆదివారం సీపీఎం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, నెలకు రెండు, మూడు సార్లు తాగునీటి సరఫరా నిలిపివేస్తూ ప్రకటనలు చేయడం పరిపాటిగా మారిందని అన్నారు. వర్షాకాలంలోనూ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడటం మున్సిపల్ యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.పట్టణ ప్రజలకు నిరంతరాయంగా మంచినీరు అందించడంలో కమిషనర్ పూర్తిగా విఫలమయ్యారని, ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి కనిపించడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే వెంటనే జోక్యం చేసుకుని కమిషనర్‌ను బదిలీ చేసి, బాధ్యతాయుతంగా పనిచేసే అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు.తాగునీటి సమస్యతో పాటు మున్సిపల్ సేవల లోపాల పరిష్కారం కోసం ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రామాంజనేయులు, చిన్న రహిమాన్, షేమిమ్ బేగం తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727