సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శిగా వాంకుడోత్ కౌలియా నాయక్ ఎన్నిక

సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శిగా వాంకుడోత్ కౌలియా నాయక్ ఎన్నిక
సింగరేణి, జూలై 12: సింగరేణి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన వాంకుడోత్ కౌలియా నాయక్ను సీపీఐ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకుని బాధ్యతలు అప్పగించారు.గత 30 సంవత్సరాలుగా సీపీఐ పార్టీలో నిబద్ధతతో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి విశేష సేవలు అందించిన ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. నేటి రాజకీయ పరిస్థితుల్లో వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్న నాయకులు ఉన్నప్పటికీ, మూడు దశాబ్దాలుగా ఒకే పార్టీలో కొనసాగుతూ సేవలందించడం అరుదైన విషయమని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా సీపీఐ కార్యదర్శి వాంకుడోత్ కౌలియా నాయక్‌ను సన్మానించి గ్రామ శాఖ కార్యదర్శిగా నియామక పత్రాన్ని అందజేశారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం వాంకుడోత్ కౌలియా నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గ్రామ శాఖ కార్యదర్శిగా ఎన్నుకున్న జిల్లా కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యదర్శి, మండల కార్యవర్గ సభ్యులు, పార్టీ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727