బీటీపీఎస్ కాలుష్య నియంత్రణకు పచ్చదనం ఒక్కటే మార్గం.

బీటీపీఎస్ కాలుష్య నియంత్రణకు పచ్చదనం ఒక్కటే మార్గం..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు–పినపాక సరిహద్దులో ఉన్న బీటీపీఎస్ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనిపై పొల్యూషన్ బోర్డు కూడా గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కాలుష్యాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, దాని ప్రభావాన్ని గణనీయంగా తగ్గించేందుకు రహదారుల ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం సమర్థవంతమైన చర్యగా నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా  మణుగూరు నుంచి జానంపేట వరకు, ఈ బయ్యారం నుంచి తోగూడెం వరకు, అలాగే ఇతర గ్రామాల ప్రధాన రహదారుల వెంట పండ్ల మొక్కలు, నీడనిచ్చే వృక్షాలను నాటితే దుమ్ము, గాలిలోని కాలుష్య కణాలను కొంతవరకు అడ్డుకునే అవకాశం ఉంటుంది. దీంతో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు, వన్యప్రాణులకు కూడా మేలు జరుగుతుంది.బీటీపీఎస్ సంస్థ తన సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా వేల సంఖ్యలో మొక్కలు పంపిణీ చేసి, వాటి సంరక్షణకు చర్యలు చేపడితే ఈ ప్రాంతం క్రమంగా పచ్చదనంతో కళకళలాడే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఆ దిశగా బీటీపీఎస్ నుంచి ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కాలుష్య నియంత్రణ చర్యలతో పాటు విస్తృత స్థాయిలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

SBNEWS ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727