తుమ్మలచెరువు వద్ద వర్షాల కోసం రైతుల ప్రత్యేక పూజలు

తుమ్మలచెరువు వద్ద వర్షాల కోసం రైతుల ప్రత్యేక పూజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట సమీపంలోని చారిత్రక తుమ్మలచెరువు వద్ద శనివారం సర్పంచ్ మర్రి సంధ్యమల్లారెడ్డి ఆధ్వర్యంలో రైతులు మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ రైతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పులిహోరను నైవేద్యంగా సమర్పించి గ్రామాభివృద్ధితో పాటు వ్యవసాయానికి అనుకూలంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించారు. వేదమంత్రాలు, భజనలు, గోవింద నామస్మరణలతో తుమ్మలచెరువు పరిసరాలు భక్తి పారవశ్యంతో మార్మోగాయి. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ చెరువు స్థానిక రైతులకు సాగునీటి ప్రధాన ఆధారమని, ప్రతి ఏడాది వర్షాకాల ప్రారంభంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామ పెద్దలు తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ ఏడాది చెరువు పూర్తిగా నిండి రైతుల పొలాలు పచ్చని పంటలతో కళకళలాడాలని రైతులు ఆకాంక్షించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727