రామచంద్రాపురం సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు వినతిపత్రం

రామచంద్రాపురం సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు వినతిపత్రం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామచంద్రాపురం గ్రామపంచాయతీలో నెలకొన్న పలు అభివృద్ధి, మౌలిక వసతుల సమస్యల పరిష్కారం కోసం గ్రామ సర్పంచ్ భూరెడ్డి స్వాతి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు శనివారం వినతిపత్రం అందజేశారు. గ్రామంలో తాగునీటి సౌకర్యం, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, ఇతర మౌలిక వసతులతో పాటు గ్రామాభివృద్ధికి సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి దశలవారీగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు, స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727