అపూర్వ స్పందన తో కొనసాగిన ఉచిత కంటి వైద్య శిబిరం

అపూర్వ స్పందన తో కొనసాగిన ఉచిత కంటి వైద్య శిబిరం 
- మాన్యులు సుంకిరెడ్డి సమాజ సేవ లను భగవంతుని లాగా గుర్తిస్తున్న పేద ప్రజలు 
నాగర్ కర్నూల్, డిసెంబర్ 26,(ఎస్ బి న్యూస్): సమాజ సేవలు చేసే వారిలో మాన్యులు శ్రీ సుంకి రెడ్డి మహాను భావుని సేవలకు అపూర్వ స్పందనతో ప్రజలు జనసంద్రంగా మారిన
సుంకిరెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరంగ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి వైద్యంలో భరోసా కల్పిస్తూ ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుంకిరెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరంకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వం కూడా చేయ లేని పనిని కళ్ళు లేని పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తు చేస్తున్న సేవలను ప్రజలు కొని యాడారు.ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు & టాస్క్ సి ఓ ఓ (TASK–C.O.O) సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డినేతృత్వంలో, శంకర నేత్రాలయ (చెన్నై) సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరం ఆరు రోజులుగా నిర్విరామంగా కొనసాగుతోంది.
ఆరు రోజుల శిబిరం ముఖ్యాంశాలు
ఇప్పటివరకు 4,000 మందికి పైగా శిబిరానికి హాజరు
2,672 మందికి ఉచిత కంటి పరీక్షలు
1,750 మందికి పైగా ఉచిత కంటి అద్దాల పంపిణీ
150 మందికి పైగా పేషెంట్లు కంటి శుక్లాల ఆపరేషన్లకు ఎంపిక
రెండు రోజుల వ్యవధిలో 56 మందికి విజయవంతమైన కంటి శుక్లాల శస్త్రచికిత్సలు పూర్తి
ఉచిత కంటి పరీక్షలు రేపటితో ముగియనున్నట్లు, కంటి శుక్లాల ఆపరేషన్ల ప్రక్రియ ఈ నెల 29వ తేదీ (సోమవారం) వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఐక్యత ఫౌండేషన్ సభ్యుల వ్యాఖ్యలు
గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలతో బాధపడుతూ సరైన అవగాహన, ఆర్థిక స్తోమత లేక చికిత్సను నిర్లక్ష్యం చేస్తున్న ప్రజలకు ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతోందని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు.
శిబిరానికి లభిస్తున్న విశేష స్పందన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ప్రజల మధ్య సంపాదించిన విశ్వాసానికి నిదర్శనం అని వారు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఆయన కృషి చేస్తున్నారని వెల్లడించారు.
ఈరోజు శిబిరం వివరాలు
1,000 మందికి పైగా హాజరు
650 మందికి ఉచిత కంటి పరీక్షలు
400 మందికి పైగా ఉచిత కంటి అద్దాల పంపిణీ
30 మంది వరకు పేషెంట్లు కంటి శుక్లాల ఆపరేషన్లకు ఎంపిక
రేపటితో ముగియనున్న ఉచిత కంటి పరీక్షలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఫౌండేషన్ మాడుగుల ఇంచార్జ్ సూదిని జైపాల్ రెడ్డి, సభ్యులు రచ్చ శ్రీరాములు, చంద్రశేఖర్, కొండల్, యాదయ్య, శేఖర్, శ్రీపతి, నాగిళ్ల శివ, ఎరుకలి శివ, శ్రీను, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727