అశ్వాపురం మెయిన్ రోడ్డు విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలి... అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే

అశ్వాపురం మెయిన్ రోడ్డు విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలి
అధికారులను ఆదేశించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్ ఇరువైపులా రోడ్డు విస్తరణ పనులు తీవ్రంగా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో, ఈ సమస్యను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారి దృష్టికి తీసుకువెళ్లారు. అశ్వాపురం మెయిన్ రోడ్డు వెంట రాకపోకలు పెరిగి, తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు ఎమ్మెల్యేకు వివరించారు.
సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు సంబంధిత ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో చరవాణిలో మాట్లాడి, రోడ్డు విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు పనులు ఆలస్యం కావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇకపై ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టంగా సూచించారు.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ, రెండు నుంచి మూడు రోజులలోపు అశ్వాపురం ప్రధాన రహదారిపై రోడ్డు విస్తరణ పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రజలకు మరింత సౌకర్యంగా మారుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727