స్వాతంత్ర్య భారత్ న్యూస్, గుండాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆదేశాల మేరకు గుండాల గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాంకుడోత్ రమేష్ ఆధ్వర్యంలో, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుచ్చయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పొంబోయిన ముత్తయ్య, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఎస్కే ఖదీర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రోల్లగడ్డ సర్పంచ్ బుక్య మంగమ్మ, దామరతో ఉపసర్పంచ్ కొమరం రమేష్, వాంకుడోత్ బికోజి, ఎస్కే అబ్దుల్ నబీ, బుక్య శ్రీను, బాబురావు, వెంకటరామ్, కల్తీ కృష్ణ, జోగ రమేష్, గడ్డం రాజేష్, బానోత్ నరేందర్, చంద్రశేఖర్, మోహన్, భరత్, జ్యోతి, అరెం రమేష్, పూణేం లక్ష్మి, సనప రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
గుండాలలో కాంగ్రెస్ నేతల విలేకరుల సమావేశం.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్
bySWATANTRYA BHARAT NEWS
-
0