- బెల్టు షాపులపై చర్యలు లేకపోతే ఉద్యమం ఉధృతం
- సిపిఎం మండల కార్యదర్శి తోలం గోపి
గుండాల మండలం సెప్టెంబర్ 27 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి: గుండాల మండలంలో విచ్చలవిడిగా ఉన్న బెల్టు షాపులను నివారించాలని సిపిఎం మండల కార్యదర్శి తోలం గోపి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాలలో బెల్ట్ షాపులు ఉదయం 5 గంటల నుంచి మొదలై అర్ధరాత్రి వరకు అమ్మకాలు కొనసాగుతున్నాయని విచ్చలవిడిగా గ్రామాల్లో దొరుకుతున్న మద్యం కారణంగా పచ్చని సంసారాలలో చిచ్చు పెడుతుందని గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తుండడంతో యువత పెడదారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుండాల మండల కేంద్రంలో బార్ షాప్ లో దొరకని మద్యం బెల్ట్ షాపులలో దొరుకుతుందని అధిక ధరలకు అమ్ముతూ బెల్ట్ షాప్ నిర్వాహకులు అమాయక ప్రజల నుంచి సొమ్ము చేసుకుంటున్నారని మండలంలో ఎక్సైజ్ శాఖ తనిఖీలు నామ మాత్రమే ఉండడం బెల్ట్ షాపుల నిర్వాహకులపై చర్య తీసుకోకపోవడం వలన గల్లీకో బెల్ట్ షాపు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే బెల్టు షాపులను మూసివేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అన్నారు. మండలంలో బెల్ట్ షాపులపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని బెల్ట్ షాపులను నివారించాలని లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బెల్ట్ షాపులపై ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఊకె వెంకటేశ్వర్లు, కల్తీ శేఖర్, ఈసం బుచ్చి రాములు ఎర్రం రామకృష్ణ పాల్గొన్నారు.
Tags
BHADRADRI KOTHAGUDEM
