50 గంటల ప్రజా కళాజాతర ప్రారంభ సమావేశం. ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా సంస్కృతి వర్ధిల్లాలి

 50 గంటల ప్రజా కళాజాతర ప్రారంభ సమావేశం. ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా సంస్కృతి వర్ధిల్లాలి




  • 50 గంటల ప్రజా కళాజాతర ప్రారంభ సమావేశం
  • ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా సంస్కృతి వర్ధిల్లాలి

హైదరాబాద్ సెప్టెంబర్ 26 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి: ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా సంస్కృతి వర్ధిల్లాలి, జానపద రూపాలను కాపాడుకోవాలని,, భూస్వామ్య పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విష సంస్కృతిని నశించాలని, సమసమాజం కావాలని,దోపిడి పీడన నశించాలని నినాదాలు చేస్తూ వివిధ కళారూపాలను ప్రదర్శిస్తూ వేలాది మంది ప్రజా కళాకారులతో ప్రజా కళాజాతర ర్యాలీ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఆర్టీసీ కళ్యాణ మండపం వరకు కొనసాగింది. దీనికి ఉభయ తెలుగు రాష్ట్రాల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు నాయకత్వం వహించారు .

ర్యాలీ ఆర్టీసీ కళ్యాణ మండపం చేరుకున్న తర్వాత సభాప్రాంగణం ఆవరణలో ఏర్పాటు చేసిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జెండాను అరుణోదయ సీనియర్ కార్యకర్త అంబిక ఆవిష్కరించారు. ఈ సందర్బంగ మల్సూర్ ఓ అరుణ పతాకమా గీతాలాపన చేశారు.

సభాప్రాంగణం అవరణలో ఏర్పాటుచేసిన ఫోటో గ్యాలరీ ప్రొఫెసర్ శాంతా సిన్హా ప్రారంభించారు. 50 ఏళ్ళ కాలంగా విమలక్క విప్లవ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో, బహుజన బతుకమ్మ కార్యక్రమాలలో భాగంగా తెలంగాణ గ్రామ గ్రామాన తిరిగి పాల్గొన్న కార్యక్రమాలను తెలియజేస్తూ ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజా కళాజాత సభా కార్యక్రమాన్ని ఉమామహేశ్వరరావు అంకురం సినిమా దర్శకులు ప్రారంభిస్తూ ప్రస్తుత పరిస్థితులలో ప్రజా సంస్కృతి వైపు నిలవడం చాలా కష్టమైందని అభిప్రాయపడ్డారు.

ప్రజా సంస్కృతి చలన శీలం గలదని, ప్రజల సమస్యలను ఎత్తిచూపుతూ నిజం వైపు నిలబడుతుందనితెలియజేశారు. 50 ఏళ్ల విమలక్క ప్రజా సంస్కృతి వైపు నిలవడం గొప్ప విషయని, 50 ఏళ్లుగా విమలక్క జనంలో ఉండి జనంతో మాట్లాడింది. జనం కోసం కొట్లాడిన ఈ క్రమంలో ఎన్నో ఆటంకాలు, నిర్బంధాలను ఎదుర్కొంది. ప్రజా సంస్కృతి వైపు నిలబడిన కళాకారులందరిపై రాజ్యం ఏదో రకంగా అంక్షలు పెట్టడం, నిర్బంధాలు పెట్టడం గతం నుంచి కూడా కొనసాగుతునే ఉంది. ఈ ఆధిపత్య భావజాలం నిజాలు దాచడం అబద్ధాన్ని మాత్రమే ప్రచారం చేయడం కొనసాగిస్తూ ప్రజాసమస్యలపై దాడులు కొనసాగిస్తున్నది. ఈ సామ్రాజ్యవాద విష సంస్కృతి ప్రస్తుతం అనేక రూపాల్లో ప్రజలకు భ్రమలు కల్పిస్తూ అనేక సమస్యలను సృష్టిస్తుంది. వినాయకచవితి భావజాలం ప్రజలను భ్రమల్లో ఉంచడం మాత్రమే. ప్రజా సంస్కృతి నిజం వైపు, ప్రజల వైప నిలబడుతుంది.

ఈ విష సంస్కృతి పల్లె భాషను, ప్రజా కళా రూపాలను నీచంగ చూడడం కూడా జరుగుతుంది. మహిళలను తక్కువగా చూడడం జరుగుతుంది. రాజులను కీర్తించడం, ప్రజలు నిరంతరం భ్రమల్లో ఉండేటట్లుఈ విష సంస్కృతి పాలకులకు సహకరిస్తుంది. ఈ సందర్బంలో జానపద కళారూపాలు ప్రజల ఆయుధాలు కావాలి. ప్రజల కళారూపాలను రకాలుగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం కొనసాగిస్తుంది. జానపద కళారూపాలు ప్రజల గుండెచప్పుడు. వాటిని ఆధునీకరించుకోవాల్సన అవసరం ఉంది. ప్రజల కళారూపాలు జనం వద్దకు వెళ్లాలి. ప్రజల కళారూపాలు రేపటి తరంలోకి తొంగి చూడాలి.

ఇది ప్రజా కళాకారులు లక్షణం. ఈ లక్షణం విమలక్క లో గొప్ప గా ఉండటమే కాక అటు వైపుగా 50 ఏళ్లగా విమలక్క తన ప్రయత్నం చేస్తున్నారు. నేటి యువత ప్రజా సంస్కృతికి మద్దతుగా నిలబడాలని కోరారు. విమలక్క నేతృత్వం సిగ్నేచర్ డాన్స్, అమరులకు జోహార్లర్పిస్తూ వీరుల సన్నిధి పాట, వీరనారి ఐలమ్మ 131 జయంతి సందర్భంగా అమె ఫోటోకు పూల మాల వేసి జోహార్లర్పించారు. ఈ ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిథి భాషా సింగ్ - ప్రముఖ జర్నలిస్టు, న్యూఢిల్లీ, ప్రజా కళాజాతర ఆహ్వాన సంఘం ముఖ్యులు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, ప్రొఫెసర్ చక్రధరరావు, కట్టా భగవంత రెడ్డి, ప్రొఫెసర్ వినయ్ బాబు, రమేష్ పోతుల, మల్సూర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు సమన్వయ కర్తగా వ్యవహరిస్తూ, ప్రజా కళాజాతర కార్యక్రమ కీ నోట్ ప్రవేశపెట్టారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

SBNEWS ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727