లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్!

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్!

ముచ్చమటలు పట్టిస్తున్న ఏసీబీ డిఎస్పీ

రూ.30 వేల లంచం వ్యవహారంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

మధ్యవర్తితో కలిసి బీట్ ఆఫీసర్‌ అదుపులోకి.. ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి

గుండాల అటవీశాఖలో అవినీతి ఆరోపణలపై మరోసారి కలకలం

ఫారెస్టులో మరోసారి రుజుయైన అవినీతి.

మొన్న నరేష్, ఈరోజు రవి,  ఫారెస్టులో అక్రమాలు.

తేటతెల్లం అవుతున్న  అటవీశాఖ బాగోతలు 

అవినీతి పై ఉక్కుపాదం మోపుతున్న ఏసీబీ డిఎస్పీ రమేష్

*గుండాల మండలం సెప్టెంబర్ 3 (స్వాతంత్ర్య భారత్ ప్రతినిధి):*

గుండాల మండలంలోని అటవీశాఖలో మరోసారి లంచం వ్యవహారం కలకలం రేపింది. పోడు భూమిలో కందకాలు తీయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అటవీశాఖ బీట్ ఆఫీసర్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. గుండాల మండలం కాచనపల్లి రేంజ్ పరిధిలోని రామానుజగూడెం ఇన్‌చార్జి బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న భానోత్ రవి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి నుంచి రూ.30 వేల మొత్తాన్ని మధ్యవర్తి ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో లంచం స్వీకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీట్ ఆఫీసర్ రవితో పాటు మధ్యవర్తి పఠాన్ సాదిక్ ఖాన్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది.

*అటవీశాఖలో వరుస ఘటనలపై చర్చ*

గుండాల మండలంలో అటవీశాఖకు సంబంధించి గతంలో చోటుచేసుకున్న వివాదాలు, తాజాగా వెలుగులోకి వచ్చిన లంచం వ్యవహారం నేపథ్యంలో శాఖలో జరుగుతున్న పరిణామాలపై స్థానికంగా చర్చ మొదలైంది. “మొన్న నరేష్.. నేడు భానోత్ రవి.. అసలు అటవీశాఖలో ఏం జరుగుతోంది?” అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పోడు భూములు, అటవీ హక్కులు, కందకాలు, ఇతర అటవీ వ్యవహారాల విషయంలో క్షేత్రస్థాయిలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు.

*ఏసీబీ రంగప్రవేశంతో అధికారుల్లో కలవరం*

లంచం వ్యవహారంపై ఏసీబీ అధికారులు తదుపరి విచారణ చేపడుతున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. తాజాగా జరిగిన దాడితో గుండాల అటవీశాఖ వర్గాల్లో తీవ్ర చర్చ నెలకొంది. అవినీతికి పాల్పడే ఏ స్థాయి అధికారి అయినా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727