సూర్య–సేతు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: పినపాక ఏఈ వేణుగోపాల్


గృహ విద్యుత్ వినియోగదారులకు సౌర విద్యుత్ వినియోగం, ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు రుణ సౌకర్యాలపై అవగాహన కల్పించేందుకు “సూర్య–సేతు” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పినపాక ఏఈ వేణుగోపాల్ తెలిపారు. బుధవారం ఆయన పినపాక మండలం ఈ బయ్యారంలో గల సబ్స్టేషన్ వద్ద మాట్లాడారు. పీఎం సూర్య ఘర్–ముఫ్త్ బిజ్లీ యోజన కింద అర్హులైన వినియోగదారులకు 1 కిలోవాట్‌కు రూ.30 వేల వరకు, 2 కిలోవాట్లకు రూ.60 వేల వరకు, 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్టంగా రూ.78 వేల వరకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అందుతుందని వివరించారు.భద్రాచలం డివిజన్ కార్యాలయంలో అక్టోబర్ 1, 2 తేదీల్లో, మణుగూరు సబ్‌స్టేషన్ ప్రాంగణంలో అక్టోబర్ 3న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సూర్య–సేతు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సోలార్ వెండర్లు, బ్యాంకు లీడ్ మేనేజర్లు పాల్గొని సౌర విద్యుత్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు, సబ్సిడీ, రుణ సౌకర్యాలపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. అర్హులైన వినియోగదారులకు అక్కడికక్కడే స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. గృహ విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పినపాక ఏఈ వేణుగోపాల్ కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

SBNEWS ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727