రైతంగ సమస్యలపై సెప్టెంబర్ 28 29 30 తేదీలలో ఖమ్మం పట్టణంలో జరిగే ఏఐకేఎంఎస్ జాతీయ 4వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపు.
గుండాల మండలం సెప్టెంబర్ 26 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఖమ్మం పట్టణంలో జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జాతీయ 4వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ గుండాల మండల కేంద్రంలో ఎర్ర చొక్కాలు పంచలతో ప్రదర్శన ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షుడు గడ్డం లాలయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ గుండాల మండల కార్యదర్శి సర్పంచ్ కోరం సీతారాములు, ఏఐకేఎంఎస్
మండల కార్యదర్శి బచ్చలి సారయ్య మాట్లాడుతూ దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై రైతులు కూలీలు ఏకమై పోరాడాలని వారి పిలుపునిచ్చారు ఎన్నికలకు ముందు రైతులకు 12000 ఇస్తామని,వ్యవసాయ రంగాన్ని రక్షిస్తామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని దాదా దత్తం చేస్తూ నూతన వ్యవసాయ రంగ చట్టాలతో పల్లెలో నివసించే రైతులను దివాలా తీపిస్తున్నారని వారు అన్నారు. నూతన యాప్ లను తీసుకొచ్చి ఏజెన్సీ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం వల్ల సరైన సమయానికి ఎరువులు అందకపోవడం వల్ల రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు.మరోపక్క వర్షాలు రాక వ్యవసాయం మొత్తం బీడుబడిపోయిందని కౌలుకు తీసుకున్న రైతుల పరిస్థితి అగోమ్యాగోచరంగా మారిందని వారు అన్నారు.ఇలాంటి సమస్యలపై చర్చించడం కోసం ఈ దేశ రైతాంగ సమస్యల గురించి భవిష్యత్తు కార్యక్రమం గురించి చర్చించడం కోసం ఈ దేశవ్యాప్తంగా జరిగే మహాసభలను రైతులు కూలీలు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోఎల్లన్న బానోతు లాలు ఈసం కృష్ణ వై వెంకన్న పెండికట్ల పెంటన్న గొగ్గల శీను నరసన్న కల్తి రామ్మూర్తి రమేష్ తాటి రమేష్ కల్తీ సారన్న ఈసం నరసన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags
BHADRADRI KOTHAGUDEM