ప్రజావాణిలో ఎంపీడీవోకు బీఆర్ఎస్ నాయకుల వినతి పత్రం.
*గుండాల మండలం సెప్టెంబర్ 8 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*
కాంగ్రెస్ పార్టీ 2003 ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేయాలని సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపీడీవో కు మెమొరండాన్ని సమర్పించారు. పార్టీ మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, పార్టీ నాయకులు గడ్డం వీరన్న ఆధ్వర్యంలో ప్రజావాణిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ హామీలను అమలు చేయాలని కోరారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక వంద రోజులలో అమలు చేస్తామని చెప్పి నేటికీ 1000 రోజులైనా ఇప్పటికీ ఒక్క హామీని సైతం పూర్తి స్థాయిలో అమలు చేయలేదని దరఖాస్తులో పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి టి. రాము, యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, పార్టీ నాయకులు జాడి ప్రభాకర్, లింగగూడెం ఉపసర్పంచ్ శోభన్ బాబు, తన సరి భాస్కర్, గంగాధరి నాగన్న, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.