స్నేహబంధంతో సేవా మార్గంలో యువత ముందుకు సాగాలి

స్నేహబంధంతో సేవా మార్గంలో యువత ముందుకు సాగాలి


నవచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా యువజన సమ్మేళనం

గుండాల మండలం ఆగస్టు 3 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:

 యువత స్నేహభావంతో పాటు సేవా దృక్పథాన్ని పెంపొందించుకుని సమాజాభివృద్ధికి తోడ్పడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుండాల మండల కేంద్రంలో నవచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన యువజన సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నవచైతన్య యువజన సంఘం గతంలో అనేక సేవా కార్యక్రమాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహించి ప్రజల ప్రశంసలు అందుకుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. యువత ఐక్యంగా ఉంటే

సమాజంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనవచ్చని అన్నారు. ప్రస్తుతం కొంతమంది యువకులు మద్యం, మాదకద్రవ్యాల వంటి వ్యసనాలకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, సేవా కార్యక్రమాల వైపు యువత అడుగులు వేయాలని సూచించారు. యువతలో

స్నేహబంధం, సామాజిక బాధ్యత పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమనికి పాత్రికేయులు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727