మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి– *మిట్టగూడెం సర్పంచ్ జిమ్మా ఝాన్సీ*

 కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు పై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో  ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈనెల 26వ తేదీన ఎఫ్ఐఆర్ నెం. 589/2026 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 69, 351(2) సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇట్టి విషయంపై  బిఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకా ఈ విషయంపై స్పందించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తున్నాయని, మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి ద్వంద్వ వైఖరి ఉండకూడదని  మిట్టగూడెం సర్పంచ్ జిమ్మా ఝాన్సీ  పేర్కొన్నారు. గతంలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య పై ఇలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే పదవి నుండి తొలగించిన విషయాన్ని గుర్తు చేస్తూ,  అదే ప్రమాణాలను రేగా కాంతారావు విషయంలో కూడా సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవం, భద్రత విషయంలో రాజీ ఉండకూడదని పేర్కొంటూ, ఆరోపణలపై చట్టపరమైన ప్రక్రియకు గౌరవం ఇస్తూ  క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఆమె  కోరారు.

ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోకపోతే మండల వ్యాప్తంగా  మహిళలందరం   కలిసి రోడ్డుపై బైఠాయించి, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని  హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727