ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించిన సీపీఎం నాయకులు.. ఉద్రిక్తంగా మారిన పరిస్థితి

ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించిన సీపీఎం నాయకులు.. ఉద్రిక్తంగా మారిన పరిస్థితి
ఆదోనిలో ఇందిరమ్మ ఫేజ్-3 లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఎం నాయకులు, లబ్ధిదారులు ఎమ్మార్వో కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. సమస్యకు ఈరోజే పరిష్కారం చూపాలని, తేలే వరకు కార్యాలయం నుంచి కదిలేది లేదంటూ నినాదాలు చేస్తూ ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. దీంతో ఎమ్మార్వో కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఈరన్న మాట్లాడుతూ, 2004లో తాను 16వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్న సమయంలో లబ్ధిదారుల నుంచి రూ.2,100 చొప్పున వసూలు చేశారని, అయితే ఇప్పటివరకు వారికి ఇంటి స్థలాలు కేటాయించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లబ్ధిదారులకు స్థలాలు కేటాయించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



#SBNews #Adoni #CPM #IndirammaPhase3 #MROOffice #Protest #HouseSites #Beneficiaries #BreakingNews #TeluguNews #AndhraPradesh #LocalNews #CPMProtest #NewsUpdate

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727