సీతారాంపురం గ్రామపంచాయతీలో ఈ సమస్యను పరిష్కరించండి... సర్పంచ్ అనిత

పెంటన్నగూడెంలో కిందకు వేలాడుతున్న కేబుల్,
ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాలు
 – ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని సీతారామపురం సర్పంచ్ అనిత విజ్ఞప్తి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ పరిధిలో ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇనప విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరి ఒరిగిపోయాయి. ప్రస్తుతం అవి కేవలం విద్యుత్ తీగల ఆధారంగా నిలిచి ఉండటంతో ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అలాగే పెంటన్నగూడెం గ్రామంలో విద్యుత్ కేబుల్ కిందకు వేలాడుతూ చేతికి అందేంత ఎత్తులో ఉండటంతో చిన్నారులు, పాదచారులు, వాహనదారులకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు చెబుతున్నారు.ఈ సమస్యలపై స్పందించిన సీతారాంపురం గ్రామ సర్పంచ్ అనిత, ప్రమాదాలు జరిగే ముందు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఒరిగిపోయిన స్తంభాలను మార్చడంతో పాటు వేలాడుతున్న విద్యుత్ కేబుల్‌ను సరిచేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు.
#SBNews #Pinapaka #Seetharampuram #Pentanagudem #Electricity #PowerSafety #BhadradriKothagudem #TelanganaNews #LocalNews #BreakingNews #TeluguNews

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727