రాజ్యసభ ఎన్నికల్లో ఆర్వో నిర్ణయం చట్టవిరుద్ధం: భద్రాద్రి డీసీసీ ఉపాధ్యక్షులు గోడిశాల రామనాధం

రాజ్యసభ ఎన్నికల్లో ఆర్వో నిర్ణయం చట్టవిరుద్ధం: భద్రాద్రి డీసీసీ ఉపాధ్యక్షులు గోడిశాల రామనాధం
పినపాక :మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్‌ను తెలంగాణలో కేసు ఉందనే ఆరోపణలతో తిరస్కరించడం చట్టవిరుద్ధమని భద్రాద్రి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు గోడిశాల రామనాధం తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా ఆయన గురువారం పినపాక మండలం ఈ. బయ్యారం క్రాస్ రోడ్ లో గల పార్టీ మాట్లాడుతూ, రిటర్నింగ్ అధికారి (ఆర్వో) తీసుకున్న నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధమని, వెంటనే ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, అలాంటప్పుడు ఆమె ఏ విషయాన్ని దాచారని నామినేషన్‌ను తిరస్కరించారో స్పష్టం చేయాలని ప్రశ్నించారు.
కేంద్రంలోని NDA ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తగిన సంఖ్యాబలం లేకపోయినా మూడో అభ్యర్థిని బరిలోకి దింపడం, అదే క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించడం బీజేపీ కుట్రలో భాగమేనని విమర్శించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేసే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కేంద్రం మరియు రాష్ట్రంలో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని గోడిశాల రామనాధం హెచ్చరించారు.ఈ సమావేశం లో పినపాక సర్పంచ్ అలివేలు,కోడిరెక్కల సాయి, స్వతంత్ర రెడ్డి,పినపాక ఉప సర్పంచ్ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

⚡ SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD LIVE
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

🔥 సబ్సిడీ వరకు ₹78,000* ఉచితం! 🔥
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ Huge reduction in current bill
🌱 Clean green energy
🏠 Increase in the value of your home property
🏛️ Direct government subsidy benefit
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727