అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి: సీఐటీయూ

అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి: సీఐటీయూ
ఆదోని:ఆలూరు మండలం పెద్దహోత్తూరు గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త లేపాక్షి ఆత్మహత్యాయత్నానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. అంజిబాబు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి. నిర్మల డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆదోనిలోని ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి వెంకటమ్మ అధ్యక్షతన ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, లేపాక్షి ఆత్మహత్యాయత్నానికి రాజకీయ వేధింపులే కారణమని ఆరోపించారు. వేధింపులకు పాల్పడిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పటికే యాప్‌ల సాంకేతిక సమస్యలు, అధికారుల ఒత్తిళ్లు, అధిక పనిభారం వంటి కారణాలతో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ వేధింపులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకుంటుండగా, ఇప్పుడు జిల్లాలోనూ ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కార్యదర్శి తిప్పన్న, నాయకులు అజీమ్ ఖాన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు గోవర్ధనమ్మ, వరలక్ష్మి, సరోజ, సోమక్క, రిజ్వానా, కరుణ, రంగం, ఆలూరు జ్యోతి, ఎబిషా రాణి, బాలరంగమ్మ, భాగ్యలక్ష్మి, శైలజ, నాగరాణి, విశాలాక్షి, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727