వి.బి.జి. రామ్‌జీ చట్టాన్ని రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి– సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య

వి.బి.జి. రామ్‌జీ చట్టాన్ని రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి
– సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య
మణుగూరు, జూన్ 29: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వి.బి.జి. రామ్‌జీ చట్టాన్ని వెంటనే రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు.

సోమవారం మణుగూరులో నిర్వహించిన సిపిఎం పార్టీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులకు ఉపాధి హామీ చట్టం జీవనాధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని బలహీనపరిచే లేదా ప్రత్యామ్నాయ చట్టాలతో ప్రజల హక్కులను హరించే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు.

గ్రామీణ ప్రజలకు కనీస ఉపాధి హక్కును పరిరక్షించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని, కూలీలకు తగిన పనిదినాలు, సమయానికి వేతనాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727