ప్రమాద బీమా పాలసీలు తీసుకోవాలి: సీఐ వెంకటేశ్వర రావు


పొట్లపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన–99 డేస్ ప్లాన్ గ్రామసభలో ఇతర అధికారులతో కలిసి సీఐ వెంకటేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా పోస్టల్, ఎస్‌బీఐ తదితర సంస్థల్లో తక్కువ వార్షిక చందాతో లభించే ప్రమాద బీమా పాలసీలు తీసుకోవాలని సూచించారు. కుటుంబ పెద్దకు ఏదైనా ప్రమాదం జరిగితే అతనిపై ఆధారపడిన పిల్లలు, వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పించడంలో ఇటువంటి బీమా పథకాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామస్థులు బీమా పథకాలపై అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ రోడ్డు ప్రమాదాల పై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదంలో మరణించడం అంటే ఒక కుటుంబం రోడ్డు మీద పడటం అని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

⚡ SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD LIVE
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

🔥 సబ్సిడీ వరకు ₹78,000* ఉచితం! 🔥
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ Huge reduction in current bill
🌱 Clean green energy
🏠 Increase in the value of your home property
🏛️ Direct government subsidy benefit
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743