అవసరానికి మించి నిల్వలతో ఇంధన కొరత భావన – గందరగోళం వద్దు: ఎంపీడీవో ముత్యాలరావు
అశ్వాపురం, ఏప్రిల్ 28 (ప్రతినిధి):
ప్రజలు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవడంతో ఇంధన కొరత ఉన్నట్లు భావన ఏర్పడుతోందని అశ్వాపురం ఎంపీడీవో ముత్యాలరావు తెలిపారు. వాస్తవానికి ఇంధనం తగినంతగా ఉన్నప్పటికీ భయాందోళనలతో ప్రజలు అధికంగా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.
ఈ పరిస్థితి కారణంగా నిత్యవసర సరుకుల రవాణా, అత్యవసర వైద్య సేవలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డీసీఎంలు, లారీల రవాణా అంతరాయం కలగడంతో సరుకుల ధరలు పెరిగే ప్రమాదం ఉందన్నారు.
అవసరం ఉన్నప్పుడే బయటికి వెళ్లాలని, ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రజలకు సూచించారు. అనవసరంగా రోడ్లపై తిరగడం వల్ల నిజంగా అవసరమైన వారికి ఇబ్బందులు కలుగుతాయని హెచ్చరించారు. గత రెండు రోజులుగా రవాణా, దిగుమతులు-ఎగుమతులు నిర్వహిస్తున్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
Tags
అశ్వాపురం