సెన్సస్ స్వీయ గణన మే 10లోపుపూర్తి చేయండి – తహసిల్దార్ ఖాసీం

సెన్సస్  స్వీయ గణన మే 10లోపు
పూర్తి చేయండి – తహసిల్దార్ ఖాసీం

గుండాల మండలం ఏప్రిల్ 28 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

మండలంలోని ప్రతి కుటుంబం సెన్సస్–2027లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని తహసిల్దార్ ఖాసీం పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా మే 10 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రజలు తమ కుటుంబ వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. స్వీయ గణన విధానం ద్వారా ప్రజలే తమ వివరాలను నమోదు చేయడం వల్ల తప్పులు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మొబైల్‌కు “హెచ్” అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య వస్తుందని తెలిపారు. మే 11 తర్వాత ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు ఆ సంఖ్యను చూపించాల్సి ఉంటుందని, ఆ నంబర్ ఆధారంగా నమోదు చేసిన వివరాలను ధృవీకరించి తుది సమర్పణ చేపడతారని చెప్పారు. అందువల్ల మండలంలోని ప్రజలందరూ స్వీయ గణనను సమయానికి పూర్తి చేసి ప్రభుత్వానికి సహకరించాలని తహసిల్దార్ ఖాసీం విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727