నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు

నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు – సమస్యల పరిష్కారానికి డిమాండ్
📍 పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
📅 తేదీ: 17-04-2026

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. నల్ల బ్యాడ్జీల ద్వారా ప్రభుత్వం తమ సమస్యలపై వెంటనే స్పందించాలని నిరసన వ్యక్తం చేశారు.అనంతరం పినపాక మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై ఉన్న మొండి వైఖరిని విడనాడి పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. పీఆర్‌సీ కమిషన్ నివేదికను వెంటనే తీసుకొని 51% ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని, కొత్త హెల్త్ కార్డులను తక్షణమే ప్రారంభించాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయడమే కాక
రిటైర్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్‌ను వెంటనే చెల్లించాలన్నారు.మొత్తం 63 సమస్యలపై ప్రభుత్వం స్పందించి తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.అనంతరం పినపాక మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727