మాదిగలకు 11% రిజర్వేషన్ కల్పించాలి: ఎమ్మార్పీఎస్

మాదిగలకు 11% రిజర్వేషన్ కల్పించాలి: ఎమ్మార్పీఎస్
📍 పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

మాదిగలకు జనాభా ప్రాతిపదికన 11 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కో-కన్వీనర్ వంగూరి రామ్మూర్తి మాదిగ అధ్యక్షతన పాల్వంచ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు దేపంగి రమణయ్య మాదిగ మాట్లాడారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న 15 శాతం ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ ప్రకారం మాదిగలకు 11 శాతం వాటా ఇవ్వాలని కోరారు. మాదిగల జనాభా 10 నుంచి 11 శాతం వరకు ఉందని, కుల గణన పూర్తి స్థాయిలో జరిగితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని తెలిపారు. 9 శాతం రిజర్వేషన్లను సమర్థించిన వారు జాతికి అన్యాయం చేసినట్టేనని విమర్శించారు.

ఎస్సీ వర్గీకరణ చట్టం అమలులో భాగంగా మాదిగలకు 11 శాతం వాటా కేటాయించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మాదిగల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలని, జాతి ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

మహాత్మ జ్యోతిరావు పూలే ద్విశత జయంతి ఉత్సవాల కమిటీలో మందకృష్ణ మాదిగకు స్థానం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి సోమయ్య మాదిగ, జిల్లా కన్వీనర్ నల్లగట్ల వెంకన్న మాదిగ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727