ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో సమస్యల పరిష్కారం వేగవంతం: ఐటీడీఏ పీవో బి. రాహుల్

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో సమస్యల పరిష్కారం వేగవంతం: ఐటీడీఏ పీవో బి. రాహుల్
మణుగూరు, ఏప్రిల్ 16:
గ్రామస్థాయిలో సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరించేందుకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కీలకంగా మారిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీవో) బి. రాహుల్ తెలిపారు.

మణుగూరులోని కెనరా కళ్యాణమండపంలో గురువారం నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు రాష్ట్ర గీతాన్ని ఆలపించి ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రజలకు వినిపించారు.

ఈ సందర్భంగా పీవో రాహుల్ మాట్లాడుతూ, గ్రామసభల ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని ప్రభుత్వానికి నివేదించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో సమర్థంగా పనిచేస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

రైతుల ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ముందస్తు బుకింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించిన ఆయన, విద్యార్థుల సంక్షేమం కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని కచ్చితంగా అమలు చేయాలని, డ్రాప్‌అవుట్ విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్చాలని ఆదేశించారు.

వేసవి తీవ్రత దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం, ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సంక్షేమ పథకాలు అర్హులకే చేరేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని తెలిపారు.

అనంతరం 24 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.2.16 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను, అంగనవాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు.

తదుపరి తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన పీవో, ఓటర్ నమోదు మరియు తొలగింపు ప్రక్రియలపై వివరాలు తెలుసుకుని రికార్డులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అద్దంకి నరేష్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, అంగనవాడీ టీచర్లు పాల్గొన్నారు.


:

#ITDA #PORahul #Manuguru #PublicAdministration #TelanganaNews #RuralDevelopment #SHG #Anganwadi #GovtSchemes


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

⚡ SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD LIVE
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

🔥 సబ్సిడీ వరకు ₹78,000* ఉచితం! 🔥
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ Huge reduction in current bill
🌱 Clean green energy
🏠 Increase in the value of your home property
🏛️ Direct government subsidy benefit
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727