నర్సరీల్లో నాణ్యమైన మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలి: అడిషనల్ పీడీ రమణ


నర్సరీల్లో నాణ్యమైన, మేలురకమైన మొక్కలను పెంచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) రమణ సూచించారు. సోమవారం ఆయన పినపాక మండలంలో పర్యటించి స్థానిక ఎంపీడీవో వెంకటేశ్వరరావుతో కలిసి పలు గ్రామ పంచాయతీల నర్సరీలను పరిశీలించారు.ఈ సందర్భంగా భూపాలపట్నం, బోటిగూడెం, ఉప్పక, సీతంపేట గ్రామాల నర్సరీలను సందర్శించి మొక్కల పెంపకం, సంరక్షణ, పంపిణీ విధానాలపై సమగ్రంగా పరిశీలించారు. నర్సరీల్లో మొక్కల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలకు అందించే మొక్కలు ఆరోగ్యవంతంగా, పర్యావరణానికి అనుకూలంగా ఉండాలని సూచించారు.
ప్రతి గ్రామంలో పచ్చదనం పెంపొందించడంలో నర్సరీల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు నర్సరీలను సక్రమంగా నిర్వహించి, అవసరమైన మొక్కలను సమయానికి అందించాలని ఆదేశించారు. మొక్కల పెంపకంలో సాంకేతిక పద్ధతులు అనుసరించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీఓ వీరభద్ర స్వామి , భూపాలపట్నం సర్పంచ్ స్వప్న, ఉప్పాక సర్పంచ్ బాబురావు, బోటు గూడెం సర్పంచ్ బాపనమ్మ, సీతంపేట సర్పంచ్ శివశంకర్,సెక్రటరీలు అరుణ శ్రీ, చంద్రశేఖర్, అశోక్ కుమార్, జ్యోతి, బోటిగూడెం ఉపసర్పంచ్ కొమరం ధన లక్ష్మి,గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

⚡ SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD LIVE
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

🔥 సబ్సిడీ వరకు ₹78,000* ఉచితం! 🔥
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ Huge reduction in current bill
🌱 Clean green energy
🏠 Increase in the value of your home property
🏛️ Direct government subsidy benefit
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727