ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి పంపిణీ

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి పంపిణీ

గుండాల మండలం, మార్చ్ 13 (స్వాతంత్ర్య భారత్ ప్రతినిధి):

గుండాల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు గుండాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్షలకు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 50 మంది పదో తరగతి విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్లు, ఇతర అవసరమైన పరీక్షా సామగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాంబాబు, ఉపాధ్యక్షులు ఎస్.కే. షారోజ్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలంటే పదో తరగతి పరీక్షలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి పాఠశాలకే కాకుండా తమ తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో భయం లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని, సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. శ్రావణ సంధ్య మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ సభ్యులు విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని అందించడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థుల చదువుకు ఇలాంటి ప్రోత్సాహం చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు వేల్పు నరసింహారావు, మంకిడి సుధాకర్, కె. నాగార్జున, రమణ బాబు, రమేష్, గణేష్, మలిపెద్ది పవన్, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727