పినపాక పీహెచ్‌సీలో మెగా హెల్త్ క్యాంప్ – 216 మందికి వైద్య సేవలు

పినపాక పీహెచ్‌సీలో మెగా హెల్త్ క్యాంప్ – 216 మందికి వైద్య సేవలు... డాక్టర్ దుర్గ భవాని
పినపాక:పినపాక మండలంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మెగా హెల్త్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించగా, ప్రత్యేక అధికారి తాతారావు, సర్పంచ్ అలివేలు, తహసీల్దార్ గోపాల కృష్ణ ప్రారంభించారు.

ఈ శిబిరంలో మొత్తం 216 మంది రోగులు వైద్య సేవలు పొందగా, అందులో 75 మంది పురుషులు, 141 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 28 పరీక్షలు నిర్వహించారు. విభాగాల వారీగా ఆర్థోపెడిక్‌లో 36 మంది, పిల్లల వైద్య విభాగంలో 8 మంది, కంటి వైద్య విభాగంలో 21 మంది, జనరల్ మెడిసిన్‌లో 90 మంది, ప్రసూతి & గైనకాలజీ విభాగంలో 61 మంది సేవలు పొందారు.

చిన్నపిల్లల వైద్య నిపుణురాలు సాధన, గైనకాలజిస్ట్ సృజన, ఆర్థోపెడిక్ నిపుణురాలు శ్రావణి, ఆప్తమాలజిస్ట్ సాయి రచన, జనరల్ వైద్య నిపుణులు హర్షిత్ పాల్గొని రోగులకు పరీక్షలు నిర్వహించారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్లు దుర్గాభవాని, వేణు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సేవలను వినియోగించుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు దుర్గా భవాని, వేణు, ఆర్బీఎస్‌కే బృందం, సూపర్వైజర్లు, ఎంఎల్హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అధికారులు పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727