ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు....ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భద్రాచలం లో ఉత్సాహభరితంగా నిర్వహణ

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
-ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భద్రాచలం లో ఉత్సాహభరితంగా నిర్వహణ
భద్రాచలం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భద్రాచలం లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాన్ మిల్టన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సైన్స్ విభాగాధిపతులు, విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతూ నోబెల్ బహుమతి గ్రహీత సీవీ రామన్ చిత్రపటానికి ప్రిన్సిపాల్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి శాస్త్ర రంగంలో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన మహానుభావుడు సి.వి. రామన్ అని కొనియాడారు. కాంతి విసరణపై చేసిన విశిష్ట పరిశోధనకు గాను 1930 సంవత్సరంలో ఆయనకు నోబెల్ బహుమతి లభించిందని వివరించారు.
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలని, సైన్స్ పరిశోధనల ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ప్రిన్సిపాల్ సూచించారు. సి.వి. రామన్ గారి జీవితగాథ విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, ప్రతి విద్యార్థి ఆయనను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కళాశాలలో వివిధ పోటీలు నిర్వహించబడ్డాయి. విద్యార్థినీ విద్యార్థులు శాస్త్ర అంశాలపై రంగోలి, వక్తృత్వ పోటీ, వ్యాసరచన పోటీ మరియు పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలలో తమ ప్రతిభను చాటుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో జరుగుతున్న ఆధునిక ఆవిష్కరణలపై విద్యార్థులు రూపొందించిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి.
పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ చేతుల మీదుగా బహుమతులు అందజేయబడినాయి. విజేతలను అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి శాస్త్ర సంబంధిత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఉపాధ్యాయులు ప్రోత్సహించారు.
ఈ వేడుకల ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ చింతన, పరిశోధనా స్పూర్తి పెంపొందించడమే లక్ష్యమని సైన్స్ విభాగాధిపతులు తెలిపారు. సమాజ సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు కనుగొనే దిశగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.శాస్త్రజ్ఞుల కృషిని స్మరించుకుంటూ, శాస్త్ర విజ్ఞాన ప్రాధాన్యతను చాటిచెప్పిన ఈ జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు కళాశాలలో ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. ఈ కార్యక్రమంలో కళాశాల సైన్స్ విభాగాధిపతులు, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

⚡ SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD LIVE
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

🔥 సబ్సిడీ వరకు ₹78,000* ఉచితం! 🔥
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ Huge reduction in current bill
🌱 Clean green energy
🏠 Increase in the value of your home property
🏛️ Direct government subsidy benefit
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743