తనపై దాడి చేశారని ఆరోపణలు చేసిన మహిళా సర్పంచ్

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని బల్మూర్ మండలం జినుకుంట గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మహిళా సర్పంచ్ రంగినేని పుష్పలతపై స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ అనుచరులు, కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రూ.50 లక్షల వ్యయంతో గ్రామం నుంచి స్టేజీ వరకు రోడ్డు నిర్మాణానికి గతంలో మంజూరు అయిందని సర్పంచ్ తెలిపారు. అయితే, రోడ్డు భూమి పూజ, పనుల ప్రారంభం విషయంలో గ్రామ సర్పంచ్ అయిన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క వార్డు మెంబర్ జేసీబీ ద్వారా పనులు ప్రారంభించారని ఆరోపించారు.
ఈ విషయాన్ని గమనించిన తాను, సమాచారం లేకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించగా, అక్కడే ఉన్న మహిళా వార్డు మెంబర్ తనపై దాడి చేసినట్లు సర్పంచ్ పుష్పలత పేర్కొన్నారు. అదే సమయంలో కావాలని ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు తన భర్తపై కూడా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
తాను ఒక మహిళా సర్పంచ్ అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఎమ్మెల్యే అండతో అధికార బలాన్ని ప్రదర్శించి దౌర్జన్యానికి పాల్పడటం అన్యాయమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడికి నిరసనగా బుల్డోజర్ ముందు కూర్చొని కొద్ది సేపు ధర్నా నిర్వహించారు.
ఇప్పటికైనా ఎమ్మెల్యే వంశీకృష్ణ తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు గ్రామాల్లో శాంతియుత వాతావరణంలో పనిచేసేలా సూచనలు ఇవ్వాలని సర్పంచ్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదని పేర్కొంటూ, ఇలాంటి ఘటనలు మానుకుని గ్రామాభివృద్ధికి అందరూ కలిసిమెలిసి పనిచేయాలని గ్రామస్తులకు ఆమె పిలుపునిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727