అద్వాన దుస్థితిలో గుండాల - మణుగూరు ప్రధాన రహదారి

అద్వాన దుస్థితిలో గుండాల - మణుగూరు ప్రధాన రహదారి

ఆదమరిస్తే అంతే సంగతులు

 తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

*గుండాల మండలం ఫిబ్రవరి 4 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

గుండాల నుండి మణుగూరు వెళ్లే ప్రధాన రహదారి సాయనపల్లి గ్రామ శివారు ప్రాంతంలో వర్షాకాలం అనంతరం తీవ్రంగా దెబ్బతింది. రహదారి అంతటా లోతైన గోతులు, కూలిపోయిన అంచులు, నీరు నిలిచే ప్రదేశాలు ఏర్పడి ప్రయాణికులకు పెను ప్రమాదంగా మారాయి. ఇంతవరకు సంబంధిత అధికారులు ఈ సమస్యను గమనించి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం ఏమరపాటు జరిగినా ప్రాణనష్టం సంభవించే పరిస్థితి ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

స్థానికులు పలుమార్లు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయగా, R&B అధికారులకు సమాచారం ఇచ్చామని, రెండు మూడు రోజుల్లో పనులు చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఆ హామీలు మాటలకే పరిమితమయ్యాయని, ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతర సమయంలో రోడ్లపై పేరుకుపోయిన చెత్తను జాతర ప్రత్యేక నిధులతో శుభ్రం చేసినప్పటికీ, ప్రమాదకరంగా ఉన్న గోతుల్లో తట్టేడు మట్టి కూడా వేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు.

ఈ రహదారి మీదుగా మణుగూరు నుంచి గుండాలకు నిత్యం బస్సు రాకపోకలు సాగుతాయి. అలాగే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు పెద్ద సంఖ్యలో ఈ మార్గాన్నే ఆశ్రయిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే భారీగా జననష్టం సంభవించే అవకాశం ఉందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు వి.సి. దొర ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రహదారి మరమ్మతులు చేపట్టి, గోతులు పూడ్చి, రహదారిని సురక్షితంగా మారుస్తూ ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాలకు దిగుతామని కూడా హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727