డిగ్రీ విద్యపై గ్రామసభలో అవగాహన

గ్రామ సభల్లో డిగ్రీ విద్యపై విద్యార్థుల తో అవగాహన సమావేశం 

“ఉపాధికి మార్గం ఉన్నత విద్య” –
 
డా. గీతాంజలి
నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 05,(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్, మంతటి గ్రామ సభల్లో “ఉపాధికి మార్గం ఉన్నత విద్య” అనే అంశంపై డిగ్రీ స్థాయి విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. గీతాంజలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో ఉన్నత విద్య ఎంతో అవసరమని విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించారు. డిగ్రీ విద్య ద్వారా విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతాయని ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యను లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు హాజీరా పర్వీన్, సతీష్ కుమార్, సుధాకర్ పాల్గొని, డిగ్రీ చదువుతో కలిగే ప్రయోజనాలు, భవిష్యత్‌లో ఉన్న అవకాశాలపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.గ్రామ సభలకు హాజరైన విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించి, డిగ్రీ విద్య ప్రాముఖ్యతపై స్పష్టత పొందారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. నేటి ప్రభుత్వాలు విద్యార్థులకు నిరుద్యోగులకు ఏ స్థాయిలో నుంచైనా 10, 12 15 పీజీ లాంటి ఉన్నత స్థాయిలలో విద్యనభ్యసించిన నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలను చేస్తే ఇలాంటి నిరుద్యోగం ఉండదు కదా అని విద్యార్థులు నిరుద్యోగులు ఆలోచిస్తున్నారు నిరుద్యోగులు, విద్యార్థులు రాజకీయ పార్టీల నేతలకు గుర్తుకు వచ్చేది ఒక్క ఎన్నికల అప్పుడు మాత్రమేనని వారు ఆలోచిస్తున్నారు. విద్యార్థులు నిరుద్యోగుల భవిష్యత్తుకు మార్గదర్శనం చూపే ప్రభుత్వాలే ఈ రకంగా చేస్తే వారికి భవిష్యత్తు ఎలా ఉంటుందని విద్యార్థులు,నిరుద్యోగులు, ప్రశ్నించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

⚡ SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD LIVE
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

🔥 సబ్సిడీ వరకు ₹78,000* ఉచితం! 🔥
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ Huge reduction in current bill
🌱 Clean green energy
🏠 Increase in the value of your home property
🏛️ Direct government subsidy benefit
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727